breaking news
Cheekatilo Movie
-
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
శోభిత తెలుగమ్మాయే. కానీ దాదాపు పదేళ్ల కెరీర్లో రెండే తెలుగు సినిమాలు చేసింది. కానీ అక్కినేని కోడలు అయిన తర్వాత ఈమె ముందు కంటే బాగానే ఫేమస్ అయిపోయింది. నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె చేసిన సినిమా 'చీకటిలో'. థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? అక్కినేని కోడలు హిట్ కొట్టిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన)కథేంటి?క్రిమినాలజీ చదివిన సంధ్య(శోభిత).. ఓ న్యూస్ ఛానెల్లో క్రైమ్ వార్తలు చదివే యాంకర్‌గా పనిచేస్తుంటుంది. చేస్తున్న ఉద్యోగంపై పెద్దగా ఆసక్తి ఉండదు. సొంతంగా పాడ్‌కాస్ట్ ఛానెల్ ప్రారంభించాలనేది ఈమె గోల్. మరోవైపు అమర్ (విశ్వదేవ్ రాచకొండ)తో ప్రేమలో ఉంటుంది. పెళ్లికి కూడా వీళ్లిద్దరూ రెడీ అవుతుంటారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ రోజు సంధ్య సహొద్యోగి బాబీ(అదితీ మ్యఖల్) హత్యకు గురవుతుంది. ఇంతకీ ఈమెని చంపింది ఎవరు? 25 ఏళ్ల క్రితం గోదావరి జిల్లాల్లో జరిగిన వరస హత్యలకు.. బాబీ చావుకు ఏమైనా సంబంధం ఉందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా అనగానే స్టోరీ ఏంటనేది ఓ అంచనా ఏర్పడుతుంది. 'చీకటిలో' కూడా దాదాపు అదే శైలిలో తీశారు. హత్యలు జరగడం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇలా చాలా విషయాలు రొటీన్‌గానే అనిపిస్తాయి. జానర్ పరంగా చూస్తే మాత్రం ఇదో మాములు స్టోరీలానే అనిపిస్తుంది. కాకపోతే ఇందులో సామాజిక అంశాన్ని చూపించిన విధానం బాగుంది.అత్యాచారాలకు ముగింపు ఇవ్వాలంటే.. ధైర్యంగా బయటకు వచ్చి తమపై అత్యాచారం జరిగిందని చెప్పే గొంతుక కావాలి. బాధితులు ధైర్యంగా ముందడుగు వేయాలి. ఈ పాయింట్ పరంగా చూస్తే మాత్రం 'చీకటిలో' కాస్త భిన్నంగా అనిపిస్తుంది. అసలు విషయానికొస్తే.. శోభిత పరిచయం, హత్యలు జరగడం లాంటి అంశాలతో సినిమాని చాలా ఫ్లాట్‌గా మొదలుపెట్టారు. దాదాపు గంటవరకు అలానే వెళ్తుంది. శోభిత, పోలీసులతో కలిసి చేసే ఇన్వెస్టిగేషన్ అయితే ఏ మాత్రం ఆసక్తి కలిగించదు. ఇప్పటికే చాలా సినిమాల్లో ఇదంతా చూసేశాం అనే ఫీలింగ్ కలిగిస్తుంది.కానీ చివరి అరగంట మాత్రం బాగుంది. రెగ్యులర్‌గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లు కూడా సీరియల్ కిల్లర్ ఎవరనేది ఊహించడం కష్టం. ఎందుకంటే హీరోయిన్ చుట్టుపక్కనే అతడు ఉంటాడు. కానీ చివరివరకు అతడు ఎవరనేది తెలియనివ్వలేదు. అలానే చిన్నతనంలో జరిగే లైంగిక వేధింపులు, పెద్దయిన తర్వాత కూడా జీవితంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అనే విషయాన్ని బాగానే చూపించారు. మహిళలపై అత్యాచారం, హత్యలు లాంటి సీన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు వల్గారిటీ జోలికి పోలేదు. ఎక్కడ అసభ్యతగా అనిపించదు.ఇలా పాజిటివ్స్ పరంగా చాలా అంశాలు ఉన్నప్పటికీ నెగిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. క్లైమాక్స్, సీరియల్ కిల్లర్ ఎవరనేది రివీల్ చేసినప్పడు తప్పితే మిగతా విషయాల్లో అస్సలు థ్రిల్ అనిపించదు. శోభిత చేసే ఇన్వెస్టిగేషన్ అయితే మరీ లాజిక్‌లెస్‌గా ఉంటుంది. పోలీసులు బొమ్మల్లా ఉంటారు. ఈమెకు మాత్రం అన్ని ప్రూఫ్స్ దొరికిపోతుంటాయి. ఇది మాత్రం కన్విన్సింగ్‌గా అనిపించలేదు.ఎవరెలా చేశారు?చాన్నాళ్ల తర్వాత శోభిత చేసిన తెలుగు సినిమా ఇది. సంధ్య పాత్రలో పద్ధతిగా చుడీదార్, చీరల్లో కనిపించింది. సెటిల్డ్ యాక్టింగ్ చేసింది. పాత్రకు ఎంత కావాలో అంతే చేసింది. డబ్బింగ్ కూడా బాగుంది. విశ్వదేవ్ రాచకొండ, ఇషా చావ్లా, ఆమని, ఝాన్సీ, రవీంద్ర విజయ్ లాంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్లలో ఒక్కరికి కూడా ఆకట్టుకునే అవకాశం దొరకలేదు. మూవీ అంతా దాదాపు శోభిత చుట్టూనే తిరగడం దీనికి కారణం కావొచ్చు.టెక్నికల్ విషయాలకొస్తే.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీకి తగ్గట్లు ఉంది. టైటిల్‌కి తగ్గట్లు సినిమా చాలావరకు చీకటిలోనే ఉంటుంది. అందుకు తగ్గట్లే సినిమాటగ్రఫీ ఉంది. దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ తప్పితే మిగతాది అంతా రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే 'చీకటిలో' మరో మంచి థ్రిల్లర్ అయ్యిండేది. కుటుంబంతోనూ కలిసి ఈ సినిమా చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!) -
'చీకటిలో' ప్రీమియర్స్.. భర్తతో కలిసి శోభిత సందడి (ఫొటోలు)
-
నా మనసుకు నచ్చిన పాత్ర సంధ్య: శోభిత ధూళి పాళ్ల
‘‘చీకటిలో’ సినిమాలో సంధ్య అనే ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్‌గా చేశాను. ఈ కథ నా చుట్టూ తిరుగుతుంటుంది. హైదరాబాద్‌లో జరిగే కొన్ని చీకటి రహస్యాలను ధైర్యంగా వెలికి తీసే పాత్ర నాది. సంధ్య ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? అన్నది సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. నా మనసుకు బాగా నచ్చిన పాత్ర సంధ్య’’ అని శోభిత ధూళి పాళ్ల తెలి పారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చీకటిలో...’. చంద్ర పెమ్మరాజు రచనా సహకారంతో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. డి. సురేష్‌బాబు నిర్మించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23 నుంచి తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా శోభిత ధూళి పాళ్ల మాట్లాడుతూ– ‘‘అమెజాన్ ప్రైమ్ వీడియోలో గతంలో ‘మేడిన్ హెవెన్’ అనే వెబ్ సిరీస్ చేశాను. ‘చీకటిలో’ కథ వారి దగ్గరకి వచ్చినప్పుడు సంధ్య పాత్ర కోసం నన్ను అనుకున్నారు. శరణ్గారు చెప్పిన ‘చీకటిలో’ కథ నచ్చింది.సంధ్య క్యారెక్టర్ గురించి వినగానే... ఓ నటిగా ఇలాంటి పాత్ర చేయాలని అనిపించింది. పాడ్ కాస్ట్ కల్చర్ మన దేశంలో ఇప్పుడిప్పుడే వస్తోంది. మా మూవీలో చూపించిన క్రైమ్ పాడ్ కాస్ట్ ఆడియన్స్‌కి కొత్తగా అనిపిస్తుందనే నమ్మకం ఉంది. ఇక నేను వేగంగా సినిమాలు చేయాలనుకోవడం లేదు. కథలు చాలా వింటున్నప్పటికీ నాకు బాగా నచ్చితేనే నటిస్తున్నాను. నేను వేరే భాషల్లో నటిస్తున్నప్పటికీ నా మాతృభాష తెలుగులో నటించడం సౌకర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం తమిళ్లో ‘వెట్టువమ్’ అనే సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు.శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ– ‘‘సంధ్య పాత్ర కోసం శోభిత వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు. ఈ మూవీ ద్వారా జనాల్లో అవగాహన తీసుకురావడంతో పాటు ఓ సందేశం కూడా ఇస్తున్నాం. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ‘అధీరా’కి నేను దర్శకత్వం వహించబోతున్నాను’’ అని పేర్కొన్నారు. విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ– ‘‘చీకటిలో’ కథ వినగానే క్రైమ్ జానర్లోకి అడుగుపెడుతున్న ఒక రియలిస్టిక్ డ్రామాలా అనిపించింది’’ అన్నారు. -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు
మరోవారం వచ్చేసింది. సంక్రాంతి రిలీజైన తెలుగు సినిమాల్లో చిరంజీవి, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ చిత్రాలు.. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దీంతో ఎప్పటిలానే ఈ వారం కొత్త రిలీజులు ఏం లేవు. 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే తెలుగు మూవీని 23వ తేదీన రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు గానీ ప్రమోషన్స్ చేయట్లేదు. దీంతో వాయిదా కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరోవైపు 'బోర్డర్ 2' అనే హిందీ చిత్రం ఇదే వీకెండ్ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్)ఓటీటీల్లో అయితే 28 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. శోభిత ధూళిపాళ్ల 'చీకటిలో' మూవీ ఆసక్తికరంగా అనిపిస్తోంది. దీంతో పాటు తేరే ఇష్క్ మైన్, మార్క్ అనే డబ్బింగ్ చిత్రాలు.. 45, సిరాయ్ అనే పరభాష సినిమాలు ఉన్నంతలో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 19 నుంచి 25 వరకు)అమెజాన్ ప్రైమ్ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 19స్టీల్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21చీకటిలో (తెలుగు సినిమా) - జనవరి 23ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25నెట్ఫ్లిక్స్సండోకన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19జస్ట్ ఏ డ్యాష్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20రిజోలి & ఐల్స్ సీజన్ 1-7 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20సింగిల్స్ ఇన్ఫెర్నో సీజన్ 5 (కొరియన్ సిరీస్) - జనవరి 20స్టార్ సెర్చ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20కిడ్నాపెడ్: ఎలిజిబెత్ స్మార్ట్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 21క్వీర్ ఐ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా (జపనీస్ సినిమా) - జనవరి 22ఫైండింగ్ హెర్ ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22ఫ్రీ బెర్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) - జనవరి 23హాట్స్టార్ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ సీజన్ 1 ఎపిసోడ్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 19హిమ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 19మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 23స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 23ఆహాసల్లియర్గళ్ (తమిళ మూవీ) - జనవరి 20శంబాల (తెలుగు సినిమా) - జనవరి 22జీ545 (కన్నడ సినిమా) - జనవరి 23మస్తీ 4 (హిందీ మూవీ) - జనవరి 23సిరాయ్ (తమిళ సినిమా) - జనవరి 23కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) - జనవరి 23ఆపిల్ టీవీ ప్లస్డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21ముబీలా గ్రేజియా (ఇటాలియన్ మూవీ) - జనవరి 23(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్ రెహమాన్)


