ధనుశ్ బాలీవుడ్ మూవీ.. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ హీరో ధనుశ్ బాలీవుడ్లో నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క మే. ఈ మూవీకి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు.తాజాగా తేరే ఇష్క్ మే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆదిపురుష్ భామ కృతి సనన్ హీరోయిన్గా కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే ధనుశ్ ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీతో పాటు ఫుల్ అగ్రెసివ్ మూవీగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్లో ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు. Tere ishk mein trailer @aanandlrai @arrahman @kritisanon @TSeries https://t.co/zpdoOh0SIe— Dhanush (@dhanushkraja) November 14, 2025