ధనుశ్ బాలీవుడ్ మూవీ.. అఫీషియల్ ట్రైలర్‌ వచ్చేసింది! | Dhanush And Kriti Sanon Tere Ishk Mein Movie Official Trailer, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Tere Ishk Mein Trailer: ధనుశ్ బాలీవుడ్ మూవీ.. అఫీషియల్ ట్రైలర్‌ వచ్చేసింది!

Nov 14 2025 10:13 PM | Updated on Nov 15 2025 1:42 PM

Dhanush Kriti Sanon Tere Ishk Mein Official Trailer

కోలీవుడ్ హీరో ధనుశ్ బాలీవుడ్లో నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క మే. మూవీకి ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్‌ మొదలు పెట్టిన మేకర్స్ ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు.

తాజాగా తేరే ఇష్క్ మే ట్రైలర్ను రిలీజ్ చేశారు. మూవీలో ఆదిపురుష్ భామ కృతి సనన్ హీరోయిన్గా కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే ధనుశ్ మూవీలో ఎయిర్ఫోర్స్కమాండర్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీతో పాటు ఫుల్ అగ్రెసివ్మూవీగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమా నవంబర్ 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. మూవీని టీ సిరీస్బ్యానర్లో ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement