చలో కేరళ | Akkineni Nagarjuna 100th Film upcoming schedule planned in Kerala | Sakshi
Sakshi News home page

చలో కేరళ

Dec 30 2025 12:29 AM | Updated on Dec 30 2025 12:29 AM

Akkineni Nagarjuna 100th Film upcoming schedule planned in Kerala

కేరళ కాలింగ్‌ అంటున్నారట హీరో నాగార్జున. ఆయన కెరీర్‌లోని వందో సినిమా ‘కింగ్‌ 100’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్‌.ఏ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది.

కాగా ఈ సినిమా కోసం ఓ షెడ్యూల్‌ని కేరళలో ప్లాన్‌ చేశారట మేకర్స్‌. ఇందుకోసం నాగార్జున త్వరలోనే కేరళ వెళ్తారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. జనవరి మొదటివారంలో కేరళ షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుందట. నాగార్జునపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని టాక్‌. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా 2026లో విడుదల అవుతుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement