కోలీవుడ్ హీరో ధనుశ్ బాలీవుడ్‌లో నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క్ మే(Tere Ishq Mein Movie). ఈ మూవీకి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ మూవీలో ఆదిపురుష్ భామ కృతి సనన్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ తెలుగు టైటిల్ను ఖరారు చేశారు. టాలీవుడ్లో అమరకావ్యం అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌లో ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు.
A love story etched into history ❤️🔥#TereIshqMein arrives in Telugu as #AmaraKavyam ❤️🔥
In cinemas 28th November ✊🏾@dhanushkraja @kritisanon @arrahman @aanandlrai #BhushanKumar #HimanshuSharma #KrishanKumar @Irshad_kamil @neerajyadav911 @ShivChanana @NeerajKalyan_24 @TSeries… pic.twitter.com/AeTgFO1omf— Vamsi Kaka (@vamsikaka) November 23, 2025


