తొలిసారి నయన్ ఇలా.. చిరంజీవి ఏమో.. 'మన శంకర వరప్రసాద్ గారు' విశేషాలు | Mana Shankara Vara Prasad Garu Movie Interesting Facts | Sakshi
Sakshi News home page

Mana Shankara Vara Prasad Garu: చిరు-అనిల్ రావిపూడి.. ఈసారి హిట్ కొడతారా?

Jan 11 2026 12:21 PM | Updated on Jan 11 2026 3:19 PM

Mana Shankara Vara Prasad Garu Movie Interesting Facts

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అంటే ఆదివారం సాయంత్రం ప్రీమియర్లతో షోలు పడనున్నాయి. వరస హిట్స్ కొడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడితో చిరు చేసిన మూవీ కావడం పాజిటివ్‌గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ కొన్ని విషయాలు మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటి?

  • 2017లో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి పలు కమర్షియల్, పీరియాడిక్ మూవీస్ చేశారు. కానీ పూర్తిస్థాయిలో ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో చేసిన సినిమా ఇదే. దానికి తోడు సంక్రాంతికి మూవీ రిలీజ్ చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

  • పదేళ్ల క్రితం 'పటాస్'తో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి.. దాదాపు ప్రతి మూవీతోనూ హిట్ అందుకుంటున్నాడు. 'ఎఫ్3' చిత్రం మాత్రమే ఓకే ఓకే అనిపించుకుంది గానీ మిగిలనవన్నీ కూడా హిట్స్‌గా నిలిచాయి. గతేడాది రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' అయితే కేవలం తెలుగులోనూ విడుదలైనప్పటికీ రూ.250 కోట్లకు పైనే వసూళ్లు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా ఈ డైరెక్టర్ ట్రాక్ రికార్డు.. 'మన శంకర వరప్రసాద్' కలిసొచ్చేలానే కనిపిస్తోంది.

  • నయనతార.. హీరోయిన్‌గా సినిమాలు చేయడం తప్పితే ప్రమోషన్లకు హాజరైంది లేదు. అలాంటిది ఈ చిత్రం కోసం ప్రారంభంలో ఓ ప్రమోషనల్ వీడియోలో కనిపించింది. రీసెంట్‌గా మరో వీడియో కూడా చేసింది. విదేశాల్లో ఉండటం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కాలేపోయింది. ఒకవేళ వచ్చుంటే మాత్రం రికార్డ్ అయిపోయేది.

  • రీసెంట్ టైంలో చిరంజీవి ప్రతి సినిమాలో ఎవరో ఒక హీరో కీలక పాత్ర చేస్తున్నారు. ఈ మూవీలో వెంకటేశ్ అలాంటి రోల్‌లో కనిపించనున్నారు. వెంకీ పాత్ర దాదాపు 20 నిమిషాల పాటు ఉండనుంది. 'ఏంటి బాసూ సంగతి..' అనే పాటలో చిరు-వెంకీ కలిసి డ్యాన్స్ కూడా చేయనున్నారు. ఇప్పటికే ఆ సాంగ్ రిలీజ్ చేశారు.

  • ఈ సినిమా రెమ్యునరేషన్స్ విషయానికొస్తే.. చిరంజీవి రూ.70-75 కోట్ల వరకు తీసుకున్నారట. ఈయన కెరీర్‌లో ఇదే అత్యధికమని టాక్. వెంకటేశ్‌కి రూ.10-15 కోట్లు, నయనతారకు రూ.9 కోట్లు, దర్శకుడు అనిల్ రావిపూడికి రూ.20-25 కోట్ల పారితోషికం ఇచ్చారని సమాచారం.

  • టికెట్ బుకింగ్ సైట్ బుక్ మై షోలో ఇన్నాళ్లు ఏ సినిమా రిలీజైనా సరే రివ్యూలు, రేటింగ్స్ లాంటివి ఉండేది. ఈ మూవీ కోసం అలాంటివే లేకుండా చిత్రబృందం ఏకంగా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంది. తెలుగు వరకు అయితే ఇలా చేసిన తొలి చిత్రమిదే!

  • రీఎంట్రీలో చిరంజీవి పలు సినిమాలు చేసినప్పటికీ.. ఇందులో తన వింటేజ్ చిత్రాలని గుర్తుచేసేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. అలానే మూవీలో ఓ సన్నివేశంలో చిరు పాటలకు వెంకీ, వెంకటేశ్ పాటలకు చిరు డ్యాన్స్ చేస్తారని రూమర్ అయితే ఉంది. ఇందులో నిజమెంత అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

  • ఇలా పలు విశేషాలతో థియేటర్లలోకి వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ హిట్ అవ్వడం చిరంజీవికి చాలా కీలకం. ఎందుకంటే తర్వాత రాబోయే 'విశ్వంభర'కు కాస్తోకూస్తో బజ్ రావాలంటే ఇది సక్సెస్ కావాల్సిందే. మరి ఈసారి చిరు-అనిల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement