కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తారతమ్యం లేకుండా నటిస్తూ పాన్ ఇండియా కథానాయకుడిగా రాణిస్తున్న నటుడు ధనుష్. అదేవిధంగా నటుడిగా, కథకుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సత్తా చాటుతున్న ఈయన ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలా ధనుష్ నటిస్తున్న తాజా చిత్రాల్లో తేరే ఇష్క్ మే(Tere Ishk Mein) హిందీ చిత్రం ఒకటి. కృతిసనన్(Kriti Sanon) నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్.రెహా్మన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి గుడ్ టాక్‌ను క్రియేట్ చేసింది. తేరే ఇష్క్ మే చిత్రం ఈనెల 28న హిందీ, తమిళం తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ సందర్భంగా కృతి సనన్(Kriti Sanon) ధనుష్ సరసన నటించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ ధనుష్ ఒక అసాధారణ నటుడని అన్నారు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం కలిగిన నటుడని అన్నారు. ఆయనతో నటించడానికి చాలా ఎగ్జైటెడ్ ఫీలయ్యానని, ధనుష్ నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. ఆయనతో కలిసి నటించడాన్ని చాలా ఎంజాయ్ చేశానని అన్నారు. తమ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందన్నారు. తామిద్దరం చాలా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టి.సిరీస్‌కు చెందిన గుల్షన్‌కుమార్, కలర్ ఎల్లో సంస్థ సమర్పణలో ఆనంద్ ఎల్.రాయ్, హిమాన్షూశర్మ, భూషన్‌కుమార్, కృష్ణకుమార్ కలిసి నిర్మించారు.


