స్కిల్‌ గేమ్స్‌ అనుకొని ప్రమోట్‌ చేశాం | Actress Nidhhi Agarwal Appears Before CID In Online Betting Games Case | Sakshi
Sakshi News home page

స్కిల్‌ గేమ్స్‌ అనుకొని ప్రమోట్‌ చేశాం

Nov 22 2025 4:18 AM | Updated on Nov 22 2025 4:18 AM

Actress Nidhhi Agarwal Appears Before CID In Online Betting Games Case

బెట్టింగ్‌ యాప్స్‌ కేసుపై హీరోయిన్‌ నిధి అగర్వాల్, యాంకర్‌ శ్రీముఖి, అమృతా చౌదరి 

సీఐడీ సిట్‌ విచారణకు హాజరు.. ఒప్పందాలు, పారితోషికాలపై ప్రశ్నించిన అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రమోషన్‌ చేసిన కేసులో హీరోయిన్‌ నిధి అగర్వాల్, సోషల్‌ మీడి యా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అమృత చౌదరి, యాంకర్‌ శ్రీముఖి శుక్రవారం మధ్యా హ్నం 2 గంటలకు సీఐడీ సిట్‌ విచారణకు హాజరయ్యారు. సిట్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ సింధుశర్మ, సీఐడీ ఎస్పీ వెంకటలక్షి్మతో కూడిన బృందం వారిని విడివిడిగా ప్రశ్నించింది. జీత్‌ విన్‌ అనే బెట్టింగ్‌ సైట్‌ను నిధి అగర్వాల్, ఎమ్‌88 అనే యాప్‌ను శ్రీముఖి, యోలో 247, ఫెయిర్‌ప్లే యాప్‌లను అమృత చౌదరి ప్రమోట్‌ చేసినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. దర్యాప్తులో భాగంగా శ్రీముఖిని సుమారు గంటన్నరపాటు ప్రశ్నించారు.

అలాగే నిధి అగర్వాల్, అమృత చౌదరిని సాయంత్రం 5:30 గంటల వరకు విచారించి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. స్కిల్‌ బేస్డ్‌ గేమింగ్‌ యాప్స్‌ అనే భావనతోనే వాటిని ప్రమోట్‌ చేసినట్లు నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖి వెల్లడించినట్లు సమాచారం. బెట్టింగ్‌ యాప్‌లతో కుదుర్చుకున్న ఒప్పందాలు సహా ఆయా సంస్థల నుంచి తీసుకున్న పారితోషికాలు, బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు పరిశీలించారు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్లకు సంబంధించి నమోదైన కేసుల్లో పలువురు టాలీవుడ్‌ నటులు, యాంకర్లు, యూట్యూబర్లు సహా మొత్తం 29 మందిని సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ, రాణా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్‌తోపాటు పలువురు యూట్యూబర్లను ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement