Betting App Case బెట్టింగ్ మహామ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లలో పాల్గొంటున్న సెలబ్రిటీలపై మండిపడ్డారు. వీళ్లేం సెలబ్రిటీలు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ నెట్టింట సంచలనంగా మారింది.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో సజ్జనార్ స్పందించారు.
#SayNoToBettingApps
వీళ్లేం సెలబ్రిటీలు?
అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు?
బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని… pic.twitter.com/GWJIvSK7uF— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 7, 2025
(గుండెలు పగిలేలా ఏడ్చారు.. పోరాడి గెలిచారు!)
ట్వీట్‌లో సజ్జనార్ ఏమన్నారంటే..
వీళ్లేం సెలబ్రిటీలు?
అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు?
బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా?
సమాజ మేలు కోసం, యువత ఉన్నతస్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి.’’ అంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్


