సాక్షి,హైదరాబాద్: కేంద్ర సర్వీసుల చరిత్రలోనే తొలిసారి గ్రూప్-1 డీఎస్పీగా పోలీసు శాఖలో కెరియర్ ప్రారంభించిన ఓ అధికారి అదనపు డీజీపీ స్థాయికి ఎదిగారు. సాదారణంగా కన్ఫర్డ్ ఐపీఎస్ ఇన్సెక్టర్ జనరల్(ఐజీ)ర్యాంక్‌కే పరిమితం అవుతారు. కానీ ప్రస్తుత రాచకొండ పోలీసుల కమిషనర్ జీ.సుధీర్‌బాబు చరిత్ర సృష్టించారు. 1989 బ్యాచ్ డీఎస్పీగా సర్వీసులోకి అడుగపెట్టిన సుధీర్ బాబు 2002లో ఐపీఎస్‌గా (పదోన్నత పొందడం) కన్ఫర్డ్ అయ్యారు. .
హైదరాబాద్ నగరంలోని అత్యంతక్లిష్టమైన ఈస్ట్‌జోన్,నార్త్ జోన్‌లకు ఆయన ఎస్పీ ర్యాంకులో డీసీపీగా సేవలందించారు. ఆ తర్వాత డీజీఐ,ఐజీగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎక్కడ పని చేసినా తన దైన ముద్రవేసుకుంటూ,సౌమ్యుడిగా, వివాద రహితుడిగా విధులు నిర్వహించే సుధీర్‌బాబు ప్రస్తుతం రాచకొండ పోలీసు కమిషనర్‌గా ఉన్నారు.
తాజాగా,సోమవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం 2001 బ్యాచ్‌కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు డాక్టర్. అకున్ సబర్వాల్ ఐపీఎస్, జి. సుధీర్‌బాబు ఐపీఎస్‌లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జి. సుధీర్‌బాబు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి లేదా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి పదోన్నతి అమల్లోకి వస్తుంది.


