ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌.. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే స్పెషల్‌ రైళ్లు | Indian Railways To Operate 160 Special Trains For Holi Festival 2026 In South Central Region, Check Out Details Inside | Sakshi
Sakshi News home page

ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌.. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే స్పెషల్‌ రైళ్లు

Feb 5 2026 9:10 PM | Updated on Feb 6 2026 4:43 PM

South Central Railway Special Trains By Holi 2026

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగకు 160 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తాజాగా ఓ విడుదల చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి నెలలో ప్రయాణించనున్నాయి.

కాగా, హోలీకి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్టేషన్ల నుంచి విశాఖపట్నం, పాట్నా, రాజ్‌కోట్, సోలాపూర్, బిలాస్‌పూర్, దానాపూర్, రక్సౌల్, నహర్‌లగున్, హజ్రత్ నిజాముద్దీన్, షాలిమార్, హిసార్, లక్నో, సంత్రాగచి, మాల్డా టౌన్, ఛప్రా, అనేక ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లనున్నాయి. అక్కడి నుంచి రిటర్న్‌ సర్వీసులు కూడా ఉన్నట్టు రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు. పండుగకు ప్రయాణీకులు రద్దీ తగ్గించేందుకు స్పెషల్‌ రైళ్లు ఉపయోగపడుతాయని అన్నారు. 

మరోవైపు.. దేశవ్యాప్తంగా భారత రైల్వే హోలీ పండుగకు రికార్డు స్థాయిలో దాదాపు 1500 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్లాన్‌ చేస్తోంది. ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement