ఢిల్లీ: బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 1xBet కేసులో ప్రముఖులు, క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నాయకుల ఆస్తులను అటాచ్ చేసింది. మొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక సమాచారం.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రముఖ క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నాయకులు, మోడల్స్‌కు చెందిన ఆస్తులను అటాచ్ చేసింది.
అటాచ్ చేసిన ఆస్తులు
యువరాజ్ సింగ్ (క్రికెటర్): రూ.2.5 కోట్లు
రాబిన్ ఉతప్ప (క్రికెటర్): రూ.8.26 లక్షలు
సోను సూద్ (నటుడు): రూ.1 కోటి
నేహా శర్మ (నటి): రూ.1.26 కోట్లు
మిమి చక్రబోర్తి (మాజీ TMC MP): రూ.59 లక్షలు
అంకుష్ హజ్రా (బెంగాలీ నటుడు): రూ.47 లక్షలు
ఉర్వశి రౌతేలా తల్లి: రూ.2.02 కోట్లు
మొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంది.
కేసు నేపథ్యం
1xBet అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉందని ఈడీ అంచనా వేసింది. కేసు విచారణలో భాగంగా పీఎంఎల్‌ఏ కింద ఈ ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం.


