న్యూఢిల్లీ: మసాలా బాండ్ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ న్‌కు, మాజీ మంత్రి థామస్ ఇస్సాక్‌కు, సీఎం చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎం అబ్రహాంకు సోమవారం ఈడీ నోటీసులు పంపింది.
కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ బోర్డ్ అధికారులు రూ.466.91 మేర విదేశీ మారకద్రవ్య నియంత్రణ నిబంధనలను, ఆర్బీఐ షరతు లను ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి జూన్ 27వ తేదీన కేసు నమోదు చేసింది. కేఐఐఎఫ్‌బీకి కేరళ సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.


