breaking news
Masala bond
-
మసాలా బాండ్ కేసులో కేరళ సీఎంకు ఈడీ నోటీస్
న్యూఢిల్లీ: మసాలా బాండ్ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ న్కు, మాజీ మంత్రి థామస్ ఇస్సాక్కు, సీఎం చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎం అబ్రహాంకు సోమవారం ఈడీ నోటీసులు పంపింది. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ బోర్డ్ అధికారులు రూ.466.91 మేర విదేశీ మారకద్రవ్య నియంత్రణ నిబంధనలను, ఆర్బీఐ షరతు లను ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి జూన్ 27వ తేదీన కేసు నమోదు చేసింది. కేఐఐఎఫ్బీకి కేరళ సీఎం చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. -
మసాలా బాండ్లకు పన్ను ప్రయోజనం
న్యూఢిల్లీ: రూపాయి ఆధారిత మసాలా బాండ్లపై పన్ను ప్రయోజనాలు కల్పించేలా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ప్రవాసీల మధ్య ఈ బాండ్ల బదలాయింపుపై పన్ను భారం ఉండబోదని పేర్కొన్నారు. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారికి 2020 దాకా టీడీఎస్ రూపంలో 5 శాతం మాత్రమే పన్ను ఉంటుందని వివరించారు. దీన్ని 2016 ఏప్రిల్ 1 నుంచే వర్తించే విధంగా నిబంధనలను ప్రతిపాదించారు. విదేశీ వాణిజ్య రుణాలు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలపై విదేశీ సంస్థలు ఆర్జించే వడ్డీపై ప్రస్తుతం 5 శాతం మాత్రమే పన్ను ఉంటోంది. 2017 జూన్ 30 దాకా అమల్లో ఉండే ఈ వెసులుబాటును 2020 జూన్ 30 దాకా పొడిగించారు. తాజాగా ఇన్వెస్టర్ల విజ్ఞప్తుల మేరకు ఈ ప్రయోజనాన్ని మసాలా బాండ్లకూ వర్తింపచేయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.


