పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఊహించని షాక్ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ , రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, యస్ బ్యాంక్ మోసం కేసులో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ నకు చెందిన రూ .1,120 కోట్ల విలువైన 18 ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్లను ఈడీ శుక్రవారం జప్తు చేసింది.
ఇందులో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు చెందినవి 7 ఆస్తులు, రిలయన్స్ పవర్ లిమిటెడ్కు చెందినవి 2 ప్రాపర్టీలు, రిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన 9 ఆస్తులు ఉన్నాయి. అలాగే
రిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ వెంచర్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫై మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అధర్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి.
వీటితో పాటు గమేషా ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్‌తోపాటు రిలయన్స్ వెంచర్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫై మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అప్రకటిత పెట్టుబడులను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది.
The Enforcement Directorate has attached over 18 properties, Fixed Deposits, Bank Balance, and Shareholding in Unquoted Investments of the Reliance Anil Ambani Group worth ₹1,120 Crore in the Reliance Home Finance Limited/Reliance Commercial Finance Limited/Yes Bank Fraud Case.… pic.twitter.com/556XsF7VvB
— ANI (@ANI) December 5, 2025


