దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు భారత ఈక్విటీ మార్కెట్లు స్పల్ప నష్టాల్లో చలిస్తున్నాయి. ఆర్బీఐ ఎంపీసీ మూడు రోజుల సమావేశం ఈరోజు రెపో రేట్ ప్రకటనతో ముగియనుంది.
ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 79 పాయింట్లు లేదా 0.09 శాతం నష్టపోయి 85,187 వద్ద, నిఫ్టీ 50 సూచీ 12 పాయింట్లు లేదా 0.05 శాతం తగ్గి 26,021 వద్ద ఉంది.
ఈ రోజు సెన్సెక్స్‌లో రిలయన్స్, ట్రెంట్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్ పీవీ, సన్ ఫార్మా, టైటాన్ టాప్ లూజర్స్ గా ఉండగా, ఎటర్నల్, బీఈఎల్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఫార్మా, మెటల్ సూచీలు 0.3 శాతం నష్టపోయాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 0.28 శాతం పెరిగింది.
Today Nifty position 05-12-2025(time: 10:03 )

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


