ఉదయపూర్ తాజ్ ఆరావళి రిసార్ట్‌లో ఒక పెళ్లి వేడుకు అత్యంత విలాసవంతంగా జరిగింది. గ త ఏడాది నవంబరులో జరిగిన ఈ డెస్టినేషన్ వివాహానికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరా తీసింది. ఈ సందర్బంగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఒక సాధారణ రాపిడో డ్రైవర్ ఖాతాలో రికార్డు స్థాయిలో నిధులు చేరినట్లు ఈడీ గుర్తించింది. ఈడీ దర్యాప్తులో ఈ షాకింగ్ మనీ ట్రయల్ వెలుగు చూసింది
వధూవరులతో గానీ, వార బంధువులతో గానీ ర్యాపిడో డ్రైవర్‌కు ఎలాంటి సంబంధం లేకుండానే ఈ ఖాతా నుంచి ఉదయ్‌పూర్ పెళ్లి కోసం రూ. 1 కోటికి మంచి ఖర్చు చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. గుజరాత్ యువ రాజకీయ నాయకుడు ఆదిత్య జులాకు సంబంధించిన వివాహంగా భావిస్తున్నారు. ఈ విలాసవంతమైన వివాహానికి నిధుల మూలం తీవ్రమైన ప్రశ్నలకు దారితీసింది. దీంతో ఏకంగా రూ. 331 కోట్లకు పైగా డిపాజిట్లు రాపిడో డ్రైవర్ ఖాతా ద్వారా జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. 1xBet అక్రమ బెట్టింగ్ రాకెట్ దర్యాప్తులో భాగంగా ఇది వెలుగులోకి వచ్చింది. ర్యాపిడో డ్రైవర్ ఖాతానుంచి అన్ని కోట్లు ఎలా? ఆగస్టు 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో రాపిడో డ్రైవర్ ఖాతాలోకి రూ. 331.36 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అధికారులు చెబుతున్న దాని ప్రకారం, ఈ ఖాతా ఒక మ్యూల్ ఖాతా ద్వారా ఈ మోసం జరిగింది.
మ్యూల్ ఖాతా అంటే ఏంటి?
మ్యూల్ అకౌంట్ అనేది నేరస్థులు అక్రమ నిధులను స్వీకరించడానికి, బదిలీ చేయడానికి లేదా మనీ లాండరింగ్ చేయడానికి ఉపయోగించే బ్యాంక్ ఖాతా. ఖాతా నుండి డబ్బును వేరే వేరే అనుమానాస్పద ఖాతాలకుబదిలీ చేయడానికి మ్యూల్ ఖాతాలను ఉపయోగిస్తారు.దీని వలన అధికారులు నిధుల వాస్తవ మూలాన్ని గుర్తించడం కష్టమవుతుంది. ఖాతాదారులను తెలిసి లేదా తెలియకుండా కూడా ఈ బదిలీలు జరిగిపోతాయి. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాల విచారణ సందర్భంగా ఈ మ్యూల్ ఖాతాను ఈడీ కనిపెట్టింది. ఈ లావాదేవీల అసలు మూలాలపై ఈడీ ఆరా తీస్తోంది.డిపాజిట్ల పరిమాణాన్ని దాచడానికే థర్డ్ పార్టీ ఖాతాలాను వాడారని ఈడీ భావిస్తోంది. డిపాజిట్ల పరిమాణం మరియు డ్రైవర్ ఖాతాను యాదృచ్ఛికంగా దుర్వినియోగం చేయడం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి మ్యూల్ ఖాతాలను హై-ఎండ్ వేడుకలు , అనుమానాస్పద ఖరీదైన కార్యక్రమాలకు ఎలా ఎక్కువగా ఉపయోగించబడుతుందో, అనుమానం లేని వ్యక్తులను అక్రమ కార్యకలాపాల కోసం ఎలా వాడుకుంటారు అనేది ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది.
అధికారుల హెచ్చరిక
ఇటీవలికాలంలోఇలాంటి ధోరణులు సర్వసాధారమవుతున్నాయని ఈడీ సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. అయితే ఇలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడిన వారికి , వారికి సహకరించేవారికి చట్టపరంగా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండటానికి బ్యాంకు వినియోగదారులు పాటించాల్సిన సూచనలను ఈడీ జారీ చేసింది.
ఇదీ చదవండి : స్మృతి-పలాష్ పెళ్లిలో మరో ట్విస్ట్ : ఇన్‌స్టాలో అప్‌డేట్ చూశారా?
ఇలా జాగ్రత్తపడండి!
బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, UPI లేదా నెట్-బ్యాంకింగ్ యాక్సెస్‌ను ఎప్పుడూ ఇతరులతో పంచుకోవద్దు.
తెలియని వ్యక్తుల కోసం చెక్కులు లేదా ఆర్థిక పత్రాలపై సంతకం చేయవద్దు.
బ్యాంకు ఖాతా ద్వారా ఏవైనా అసాధారణ డిపాజిట్లు, ఉపసంహరణలు లేదా మీఖాతాను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించినట్లయితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. •
మీ బ్యాంకు ఖాతాను వాడుకొని, అందుకు డబ్బును ఆఫర్ చేసే వ్యక్తుల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలి.
మీ పేరుతో జారీ అయిన, మీరు వాడని ఫోన్ నెంబర్లను ప్రభుత్వ పోర్టల్ tafcop.sancharsaathi.gov.inలో డీయాక్టివేట్ చేయించుకోవాలి.


