సాక్షి, ఢిల్లీ: ప్రైవేట్ మెడికల్ కళాశాలలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. గురువారం దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు ధృవీకరించారు.
సీబీఐ కేసు ఆధారంగానే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ఎన్‌ఎంసీ ప్రమాణాలు పాటించకుండానే అప్రూవల్స్ నేపథ్యంతో ఈ రైడ్స్ జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం మెడికల్ కౌన్సిల్ సభ్యులతో పాటు మెడికల్ కళాశాలల ప్రతినిధులను సీబీఐ ప్రశ్నించింది కూడా. ఈ క్రమంలో ఇవాళ ఇటు ఈడీ ప్రత్యక్ష దాడులకు దిగడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డాకుమెంట్లను పరిశీలిస్తున్న అధికారులు.. మెడికల్ సీట్ల కేటాయింపులు సహా పలు అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.


