గ్రామీణులలో తొలిసారి సగానికి తగ్గిన ఆహార వ్యయం
పట్టణాల్లోనూ 60 శాతం పెరిగిన ఆహారేతర ఖర్చులు
ఆదాయం పెరిగే కొద్దీ, ‘హై–లైఫ్ స్టైల్’ కొనుగోళ్లు
దేశ ప్రజల తలసరి వ్యయాల్లో భారీ మార్పులు
పాతికేళ్ల నాటికీ, నేటికీ గ్రామీణ, పట్టణ భారతీయ కుటుంబాల వ్యయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆహారంపై ఖర్చు తగ్గి.. అనేక ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రజలు మెరుగైన జీవనశైలులను కోరుకోవటమే ఇందుకు కారణం. కేంద్ర గణాంక శాఖ గృహ వినియోగ వ్యయ సర్వేలు, నేషనల్ శాంపిల్ సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉంది? ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకురావాలి? ప్రజల జీవన శైలి ఎలా మారుతోంది?... అనే విషయాలను తెలుసుకోవడానికి కేంద్ర గణాంక శాఖ ఎప్పటికప్పుడు గృహ వినియోగ వ్యయంపై సర్వే జరుపుతుంటుంది. భారతీయ కుటుంబాలు వివిధ వస్తువులు, సేవల కోసం చేసే ఖర్చుల వివరాలను అనేక దఫాలుగా (రౌండ్లుగా) సర్వే చేసి, ఆ వివరాలను గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది.

ఈ క్రమంలో 2022–23, 2023–24లో జరిగిన సర్వేలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలుగా విభజించి ఈ సర్వే నిర్వహిస్తుంది. ప్రజలు ఖర్చు చేసే ప్రతి రూ.100లో 2000 నాటికీ 2024 నాటికీ నెలవారీ తలసరి వ్యయంలో చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. (గమనిక ః తలసరి నెలవారీ వ్యయం (రూ.100 కి))
⇒ నెలవారీ తలసరి ఆహార వ్యయం; తలసరి ఇంధనం, విద్యుత్‌పై చేసే వ్యయం అప్పటితో పోలిస్తే ఇప్పుడు తగ్గాయి.
⇒ అప్పట్లో మొత్తం వ్యయంలో సగం ఆహారం కోసమే ఉంటే.. ఇప్పుడది తగ్గడం విశేషం.
⇒ ఇంటి అద్దె, ఇతర వస్తువులు, సేవల ఖర్చు మాత్రం అప్పటితో పోలిస్తే భారీగా పెరిగాయి.


