సాక్షి, ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్ లోన్ మోసం కేసు విచారణలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ED)పలు లగ్జరీ కార్లను సీజ్ చేసింది.ముంబై జోనల్ ఆఫీసులోని, నవంబర్ 25-26 తేదీలలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల కింద ఈడీ ఈ సోదాలు నిర్వహించింది.
ఎస్బీఐలో వెలుగు చూసిన వాహన రుణ మోసంపై ఈడీ కఠిన చర్యలకు దిగింది. ఇందులో భాగంగా , పూణేలోని రుణగ్రహీతలు , కార్ డీలర్లకు చెందిన 12 నివాస ,కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. అప్పటి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ అమర్ కులకర్ణిపై కూడా సోదాలు జరిగాయి. ఈ సోదాల సందర్భంగా PMLA, 2002 సెక్షన్ 17 ప్రకారం. రుణగ్రహీతలు కొనుగోలు చేసిన వివిధ స్థిరాస్తుల గుర్తింపు BMWలు, వోల్వో, మెర్సిడెస్, ల్యాండ్ రోవర్లు స్వాధీనం చేసుకుంది. అలు పలు నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు.
ED, Mumbai Zonal Office has conducted search operations on 25-26 November, 2025 under the provisions of Prevention of Money Laundering Act (PMLA), 2002 at Pune at 12 residential and office premises of loan borrowers, car dealers as well as the then branch manager of SBI in… pic.twitter.com/swQYRBL2U4
— ED (@dir_ed) November 28, 2025
నిందిత రుణగ్రహీతలు నకిలీ పత్రాల ఆధారంగా మోసపూరితంగా అధిక విలువ గల కారు రుణాలను పొందారని మరియు తద్వారా బ్యాంకును మోసం చేశారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. 2017-2019 మధ్య కాలంలో, పూణేలోని యూనివర్సిటీ రోడ్ బ్రాంచ్‌లోని SBIలో చీఫ్ మేనేజర్‌గా పనిచేస్తున్నప్పుడు, కులకర్ణి తన అధికారిక పదవిని దుర్వినియోగం చేశాడని, కొంతమంది రుణగ్రహీతలతో కలిసి SBIలో ఆటో లోన్ కౌన్సెలర్ ఆదిత్య సేథియాతో కలిసి లగ్జరీ కార్ల రుణాలను మోసపూరితంగా ప్రాసెస్ చేసాడు. నకిలీ పత్రాల ద్వారా SBI బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై BMW, వోల్వో, మెర్సిడెస్ , ల్యాండ్ రోవర్‌తో సహా వివిధ అధిక విలువ గల కార్లను కొనుగోలు చేశారని తేలింది. ఇలాంటి తప్పుడు సిఫార్సుల ద్వారా SBIని మోసం చేయడానికి నేరపూరిత కుట్ర పన్నాడని ఆరోపణలు నమోదైనాయి.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ACB, పూణే ,శివాజీనగర్ పోలీస్ స్టేషన్, పూణేలో నమోదైన కేసుల ఆధారంగా, ఐపీసీ 1860, అవినీతి నిరోధక చట్టం, 1988లోని వివిధ సెక్షన్ల కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
ఇదీ చదవండి: స్మృతి-పలాష్ పెళ్లిలో మరో ట్విస్ట్ : ఇన్‌స్టాలో అప్‌డేట్ చూశారా?


