ఎస్‌బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందా?: PIB హెచ్చరిక | SBI YONO App Will Be Blocked Know The Facts | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందా?: PIB హెచ్చరిక

Mar 1 2026 8:47 PM | Updated on Mar 2 2026 12:50 PM

SBI YONO App Will Be Blocked Know The Facts

ఇటీవల కాలం తప్పుడు వార్తల ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇవన్నీ నిజమేనేమో అని నమ్మి, చాలామంది భయపడుతుంటారు. ఇలాంటి మరోవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

SBI పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక మెసేజ్, వినియోగదారులు తమ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలని పేర్కొంది. ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే, SBI YONO యాప్ బ్లాక్ చేయబడుతుందని కూడా ఇది పేర్కొంది.

మీరు మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే మీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) YONO యాప్ బ్లాక్ అవుతుందనే వార్త తప్పు అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. యోనో యూజర్లు ఎలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దు. అంతే కాకుండా మీరు వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ & ఆధార్ వివరాలను షేర్ చేసుకోవద్దు అని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement