మద్రాసు హైకోర్టు ఆదేశాలు
తమిళ సినిమా (చెన్నై): సామాజిక మాధ్య మాల్లో తన ఫొటోలను, ఇసైజ్ఞాని అనే పేరును గానీ, తనకు సంబంధించిన వార్తలనుగానీ తన అనుమతిలేకుండా వాడొద్దంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఇళయరాజా కోరినట్లుగా ఆయన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వాడొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.


