విశాల్‌కు బిగ్‌ షాక్.. పది కోట్లు చెల్లించాల్సిందే..! | Madras High Court refuses to extend time granted to actor Vishal for deposit | Sakshi
Sakshi News home page

Vishal: విశాల్‌కు బిగ్‌ షాక్.. పది కోట్లు చెల్లించాల్సిందే..!

Feb 17 2026 7:33 PM | Updated on Feb 17 2026 7:40 PM

Madras High Court refuses to extend time granted to actor Vishal for deposit

కోలీవుడ్ హీరో, నిర్మాత విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్ బిగ్ షాకిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు సంబంధించిన కేసులో విశాల్‌కు చుక్కెదురైంది. డబ్బులు చెల్లించేందుకు మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఈ కేసులో మొదట లైకాకు చెల్లించాల్సిన రూ.21.29 కోట్లను 30శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. విశాల్ రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లు చెల్లించేందుకు ఆరు వారాల గడువు కావాలని విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం అందుకు విముఖత వ్యక్తం చేస్తూ విశాల్ పిటిషన్‌ను కొట్టివేసింది.  కాగా.. సినిమా తీస్తాన‌ని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నార‌ని.. ఆ డ‌బ్బు తిరిగి చెల్లించ‌లేద‌ంటూ 2022లో లైకా ప్రొడక్షన్స్ మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 

Advertisement
 
Advertisement
Advertisement