సొంతిల్లు లేదు.. అకౌంట్‌లో రూ.50 వేలు చూడటం నా కల: విశ్వక్ సేన్ | Tollywood Hero Vishwak Sen Comments About His Career Struggles And First Big Paycheck, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Vishwak Sen: సొంతిల్లు లేదు.. అకౌంట్‌లో రూ.50 వేలు చూడటం నా కల: విశ్వక్ సేన్

Feb 17 2026 4:16 PM | Updated on Feb 17 2026 4:34 PM

Tollywood Hero Vishwak Sen comments about His Career Struggles

మాస్‌ కా దాస్‌ విశ్వక్ సేన్‌ ఇటీవలే రోటిన్‌ భిన్నంగా కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌ డైరెక్షన్‌లో వచ్చి ఫంకీ లవర్స్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. కేవలం ఫన్‌ కోసమే ఈ మూవీ తీశామని నిర్మాత నాగవంశీ కూడా సక్సెస్‌ మీట్‌లో ప్రకటించారు. ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టకపోయినా.. ఓకేలా అనిపించేశాడు విశ్వక్ సేన్. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ఈ మూవీతో విశ్వక్‌ సేన్ అలరించిన తీరు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన కెరీర్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా నాన్న మొదట్లో పిల్లలకు కరాటే నేర్పించేవారని తెలిపారు.  దానివల్ల ఎక్కువ డబ్బులు రావడం లేదని కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. నా హైయర్‌ ఎడ్యుకేషన్‌కు ఎక్కువ డబ్బులు అవసరమవుతాయని డిగ్రీతో సరిపెట్టుకున్నారని వెల్లడించారు.

నేను పుట్టినప్పుడు మాకు సొంతిల్లు కూడా లేదని విశ్వస్ సేన్ తెలిపారు. ఒకానొక సమయంలో నా అకౌంట్‌లో రూ.50 వేలు చూడడం ఓ కల అన్నారు. హిట్‌ సినిమాకు అడ్వాన్స్‌ బ్యాంక్‌లో పడే వరకూ తన అకౌంట్‌లో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నారు. ఫలక్‌నుమా దాస్‌ రిలీజ్‌ అయిన తర్వాతనే మొదటిసారి నా అకౌంట్‌లో లక్ష రూపాయలు చూశానని గుర్తు చేసుకున్నారు. అంతకుముందే హిట్‌ సినిమాకు అడ్వాన్స్‌ రూ.50 వేలు బ్యాంక్‌ ఖాతాలో చూసి చాలా సంతోషించానని తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement