సీఐడీ విచారణకు యాంకర్ శ్రీముఖి, నిధి అగర్వాల్ హాజరు! | Nidhhi Agerwal and Sreemukhi to Attend CID Inquiry | Sakshi TV | Sakshi
Sakshi News home page

Betting Apps Case: సీఐడీ ఎదుట హాజరైన యాంకర్ శ్రీముఖి, నిధి అగర్వాల్!

Nov 21 2025 7:45 PM | Updated on Nov 21 2025 8:07 PM

Nidhhi Agerwal and Sreemukhi to Attend CID Inquiry | Sakshi TV

బెట్టింగ్ యాప్స్‌ యాప్‌ కేసులో టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి, హీరోయిన్ నిధి ‍అగర్వాల్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సీఐడీ సిట్‌ పలువురు టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తోంది. ఇందులో భాగంగానే ఈ  రోజు శ్రీముఖి, నిధి అగర్వాల్‌, అమృత చౌదరిని విచారించారు. బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌తో లావాదేవీలపై వీరిద్దరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

కాగా.. ఈ కేసులో  ఇప్పటికే నటులు రానా దగ్గుబాటి, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌, విష్ణుప్రియను కూడా సీఐడీ సిట్‌ ప్రశ్నించింది. సిట్‌ అధికారుల సూచన మేరకు బ్యాంకు స్టేట్‌మెంట్లతో హీరో రానా సమర్పించారు. ‘బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలు? తీసుకున్న పారితోషికం ఎంత? బెట్టింగ్‌ యాప్‌లను ఎందుకు ప్రమోట్‌ చేయాల్సి వచ్చింది? ఎవరు మీతో ఈ అగ్రిమెంట్లను కుదుర్చుకున్న వివరాలపై సీఐడీ ఆరా తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement