1990ల్లో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన సినిమా 'రిమ్ జిమ్'. అజయ్ వేద్, వ్రజన హీరోహీరోయిన్లుగా నటించారు. బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కీలక పాత్రలు పోషించారు. రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్ర చేయడంతో పాటు పాటలు కూడా పాడాడు. హేమ సుందర్ దర్శకత్వం వహించారు. సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మించారు. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని చెప్పారు. సాంకేతిక విభాగం విషయానికొస్తే కొక్కిలగడ్డ ఇఫ్రాయిం సంగీతమందించగా.. వాసు పెండం సినిమాటోగ్రఫీ, పెనుమత్స రోహిత్ ఎడిటింగ్ చూసుకున్నారు. రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన 'గ్యాంగ్‌స్టర్' ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది.


