సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మ్యూజికల్ లవ్‌స్టోరీ సినిమాకు ‘దో దీవానే షెహర్ మే’ అనే టైటిల్ ఖరారైంది. రవి ఉడయార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శుక్రవారం ప్రకటించారు. సంజయ్ లీలా భన్సాలీ ప్రోడక్షన్స్, రవి ఉడయార్ ఫిలిమ్స్‌పై సంజయ్ లీలా బన్సాలీ, ప్రేరణా సింగ్, ఉమేష్ కుమార్ బన్సల్, భరత్ కుమార్ రంగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 20న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘‘రెండు హృదయాలు... ఒక నగరం... అసంపూర్ణమైన పరిపూర్ణ ప్రేమకథే ఈ చిత్రం. ఈ ప్రేమికుల దినోత్సవానికి ‘ఇష్క్ షే ఇష్క్ హో జాయేగా..’ (ప్రేమ ప్రేమలో పడుతుంది). విభిన్నమైన ఒక మంచి ప్రేమకథను ప్రేక్షకులకు అందించనున్నాం’’ అని పేర్కొన్నారు మృణాల్ ఠాకూర్.


