టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో బిజీగా ఉంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ఈ చిత్రానికి సామ్ నిర్మాత కాగా.. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కొద్దికాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడికెళ్లినా రాజ్, సామ్ జంటగా కనిపించడంతో పాటు అత్యంత సన్నిహితంగా మెలగడంతో దాదాపు కన్‌ఫామ్ అయినట్లేనని ఆడియన్స్ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా సుదీర్ఘమైన నోట్ కూడా రాసుకొచ్చింది. ఫుల్ యాక్షన్ మోడ్.. బీస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితం నా బ్యాక్ బలంగా లేదని వదిలేశా.. ఎందుకంటే నా జీన్స్‌లో అలా లేదని అనుకునేదాన్ని అని తెలిపింది. ఎవరినైనా అలాంటి వారిని చూసినప్పుడు.. నాకు అలా సాధ్యం కాదని అనుకుంటానని సామ్ పోస్ట్ చేసింది.
కానీ అదంతా తప్పని ఇప్పుడు తెలిసింది. నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నా.. దాన్ని ఇప్పుడు చూపించబోతున్నా.. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవడానికి చాలా తీవ్రంగా శ్రమించానని సామ్ తెలిపింది. బాడీలో కండరాన్ని నిర్మించడం చాలా ముఖ్యం.. మీరు ఎలా కనిపిస్తారనే దాని కోసం మాత్రమే కాదు.. మీరు ఎలా జీవిస్తారు.. ఎలా కదులుతారు.. మీ వయస్సు ఎలా పెరుగుతుందనే దాని కోసమని తెలిపింది.
అలాగే మీ వయసు పెరిగే కొద్ది.. బలమైన శిక్షణే మీ బెస్ట్ ఫ్రెండ్‌గా మారాలని సూచించింది. ఈ బలమైన శిక్షణే నాకు అన్నింటికంటే ఎక్కువ మేలు చేసింది.. క్రమశిక్షణ, సహనం నేర్పింది.. ఇదంతా జన్యువుల వల్ల వచ్చింది కాదని అర్థమైంది. అదంతా మనం చెప్పే ఒక సాకు మాత్రమేనని తనకు తెలిసొచ్చిందని సమంత పోస్ట్ చేసింది. నువ్వు ఏదైనా వదులుకునే దశలో ఉంటే.. ఇప్పుడు అస్సలు వదులుకోవద్దు.. నువ్వు అలానే ముందుకు సాగితే నీ భవిష్యత్తు చాలా బాగుంటుందని సామ్ అంటోంది.


