ఇటీవల సౌత్లో మలయాళ సినిమాలకు డిమాండ్ పెరిగింది. అక్కడ సూపర్ హిట్ అయితే చాలు.. డబ్ చేసి ఇతర భాషల్లోకి వదులుతున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ మలయాళ చిత్రాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు టాలీవుడ్లోనూ సత్తాచాటాయి. తాజాగా మోహన్ లాల్ తనయుడు నటించిన మరో చిత్రం వచ్చేనెలలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
మలయాళ సినిమాలు ఇతర భాషల్లో సత్తాచాడటం కామనైపోయింది. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా ఇతర భాషకు చెందిన సూపర్ హిట్ మూవీ.. ప్రస్తుతం మలయాళంలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయాన్ని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక ఉద్యమం అంటూ పోస్టర్ను పంచుకుంది. మరాఠీ సినిమా మరో భాషలో రిలీజ్ కావడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపింది. మరాఠీ సినీ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పోస్టర్లో వెల్లడించారు.
మరాఠీలో తెరకెక్కించిన దశవతార్ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మరాఠీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఈ మూవీకి సుబోధ్ కనోల్కర్ దర్శకత్వం వహించారు. ప్రియదర్శిని ఇందల్కర్, సిద్ధార్థ్ మీనన్ జంటగా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని నవంబర్ 21 మలయాళంలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మలయాళ చిత్రాలు ఇతర భాషల్లో సత్తా చాటుతుంటే.. తొలిసారి మరాఠీ మూవీ మాలీవుడ్లో హిట్ కొడుతుందా? లేదా? అన్నది తెలియాలంటే నవంబర్ 21 వరకు ఆగాల్సిందే.
Watched Dashavatar today and oh my god! It isn't just a film, it's a movement.
The first Marathi blockbuster to reach Malayalam audiences. how amazing is that!
So proud to see Marathi cinema crossing new screens and hearts💖#dashavatar #marathicinema pic.twitter.com/b43qKRcKkt— Mrunal Thakur (@mrunal0801) October 27, 2025


