హరిహర వీరమల్లు బ్యూటీ బర్త్‌ డే.. భర్త సర్‌ప్రైజ్ గిఫ్ట్! | Nargis Fakhri Receives Car From Husband Tony Beig As Birthday Gift | Sakshi
Sakshi News home page

Nargis Fakhri: హరిహర వీరమల్లు బ్యూటీ బర్త్‌ డే.. పది కోట్ల కారు గిఫ్ట్!

Nov 21 2025 9:01 PM | Updated on Nov 21 2025 9:02 PM

Nargis Fakhri Receives Car From Husband Tony Beig As Birthday Gift

బాలీవుడ్ భామ, హరిహర వీరమల్లు నటి నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) ఖరీదైన బహుమతిని అందుకుంది. ఆమె గతనెలలో 46వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ ముద్దుగుమ్మ బర్త్‌ డేను పురస్కరించుకుని ఆమె భర్త టోనీ బీగ్ లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ రోల్స్ రాయిస్ కారు విలువ దాదాపు రూ.10 కోట్లకు పైగానే ఉంది. ఈ విషయాన్ని దాదాపు నెల రోజుల తర్వాత పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.

ఈ బాలీవుడ్ భామ పలు హిందీ చిత్రాల్లో నటించింది. హిందీలో హౌస్‌ఫుల్-5, హౌస్‍ఫుల్-3, మేయిన్ తేరా హీరో, రాక్‌స్టార్ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు మూవీలో కనిపించింది ముద్దుగుమ్మ. తాజాగా మస్తీ-4 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది భామ. ఈ సినిమా ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది.

సినిమాలతో బిజీగా ఉండగానే టోనీని ఫిబ్రవరి 2025లో వివాహం చేసుకుంది. ఆమె భర్త టోనీ అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కాగా.. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ హోటల్స్‌లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి ముందు మూడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement