– మారుతి
‘‘ప్రభాస్‌గారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ మాత్రమే కాదు. ఆయన సినిమాలు విదేశాల్లోనూ విడుదల అవుతున్నాయి. ప్రభాస్‌గారు గ్లోబల్‌స్టార్. ‘ది రాజాసాబ్’ సినిమా చేసే విషయంలో నాకు ఒత్తిడి లేదు అని చెప్పలేను. అయితే సినిమా చూసుకున్నాను. హీరో క్యారెక్టర్‌తో పాటు సరికొత్త క్యారెక్టరైజేషన్స్ ను కూడా సినిమాలో చూస్తారు. ప్రభాస్‌గారిని ఎలా చూడాలని ఆడియ న్స్ అనుకున్నారో అలానే చూస్తారు’’ అని చెప్పారు దర్శకుడు మారుతి.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ , రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్‌దత్ మరో ప్రధాన పాత్రలో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో మారుతి మాట్లాడుతూ– ‘‘నేడు మా సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి.
ప్రభాస్ ఫ్యా న్స్ ఎంత సంతోషంతో థియేటర్స్‌కి వెళ్తారో, అంతకు రెట్టింపు ఆనందంతో బయటకు వస్తారు’’అని చెప్పారు. ‘‘హ్యూజ్ హారర్ ఫాంటసీ చిత్రంగా ‘ది రాజాసాబ్’ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ఈ పండక్కి ఏడు సినిమాల వరకు విడుదల అవుతున్నాయి. దీంతో థియేటర్స్‌ను షేర్ చేసుకోకతప్పదు’’ అని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ‘‘ప్రభాస్‌గారి ఓవరాల్ పెర్ఫార్మె న్స్ ను ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు తమన్ . ‘‘ఈ నెల 9 నుంచి మా సినిమాను థియేటర్స్‌లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అని పేర్కొన్నారు కృతీ ప్రసాద్.


