మెగాస్టార్ చిరంజీవి శంకర వరప్రసాద్ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొని ప్రేక్షకులను ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న అన్ని సినిమాలు సూపర్ హిట్ కావాలని, అందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే అసలైన పండుగ అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సినిమాలో తాను గతంలో చేసిన దొంగమొగుడు, ఘరానా మొగుడు, చంటబ్బాయ్ తరహా నటనను ప్రేక్షకులు చూడగలరని చిరంజీవి తెలిపారు. ఈ సినిమా ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచిందని, బడ్జెట్, టైమ్ పరంగా సమర్థవంతంగా చిత్రీకరణ పూర్తి చేయగలిగామని చెప్పారు.
వెంకటేష్‌తో కలిసి నటించడం తనకు చక్కని అనుభవమని, చివరి రోజు షూటింగ్‌లో తాను ఎమోషనల్ అయ్యానని వెల్లడించారు. వెంకటేష్ పాజిటివ్ మనిషి, తనకు గురువులా అనిపిస్తారని చిరంజీవి అన్నారు. మేము షూటింగ్ లా కాకుండా అల్లరి చేశాం, అదే క్యాప్చర్ చేశాడు అనీల్ అని చిరంజీవి నవ్వుతూ చెప్పారు. ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లేలా సపోర్ట్ చేసిన వెంకటేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు అనిల్ రవిపూడి ప్రమోషన్స్‌లో నయనతారను కూడా చేర్చారు. వెంకీతో మరిన్ని సినిమాలు చేస్తాను. ఆ బాధ్యత అనీల్‌దే అని అన్నారు. ప్రేక్షకులు అన్ని సినిమాలను థియేటర్స్‌లోనే చూడాలి. ఇది అందరికీ గుర్తుండిపోయే పండుగ అవుతుంది. ఈ మధ్యకాలంలో నేను చాలా హుషారుగా చేసిన సినిమా ఇదే. ఈ అనుభవం తనకు చాలా ప్రత్యేకమని చిరంజీవి అన్నారు.


