ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్లు చెదిరే టికెట్ ధరల పెంపు కోసం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ముందురోజు అంటే జనవరి 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 లోపు వేసే స్పెషల్ షో కోసం ఏకంగా రూ.1000 ధర పెట్టుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అలానే జనవరి 9 నుంచి తర్వాత పదిరోజుల పాటు కూడా భారీగా పెంపు ఇచ్చింది.
రిలీజ్ రోజు (జనవరి 09) నుంచి తర్వాత 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్స్‌ల్లో రూ.200 వరకు ఒక్కో టికెట్‌పై పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. మరోవైపు తెలంగాణలోనూ ఈ చిత్ర నిర్మాతలు.. హైకోర్టు నుంచి టికెట్ రేట్ల పెంపుపై ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
దాదాపు రెండు మూడేళ్లుగా ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా చేశారు. తమన్ సంగీతమందించగా, మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.



