‘‘కానిస్టేబుల్ కనకం 2’ నాకు చాలా ప్రత్యేకం. ఇంత అద్భుతమైన భావోద్వేగంతో ఉన్న కథకి నన్ను ఎంపిక చేసినందుకు డైరెక్టర్ ప్రశాంత్‌కి థ్యాంక్యూ. ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 3 కూడా చేయాలని కోరుకుంటున్నాను’’ అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం 2’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.
మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ నేటి నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ–‘‘ఈ సంక్రాంతికి అందరికీ మంచి వినోదం అందిస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ సాయిబాబా, హేమంత్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, ఈటీవీ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, నటి మేఘలేఖ మాట్లాడారు.


