బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మరో చిత్రం అఖండ-2 (Akhanda 2 Trailer). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే ది తాండవం, జాజికాయ లాంటి లిరికల్ సాంగ్స్‌ను రిలీజ్ చేశారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను (Akhanda 2 Trailer) మేకర్స్ రిలీజ్ చేశారు. బెంగళూరు వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అఖండ-2 ట్రైలర్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ చూస్తుంటే బాలయ్య డైలాగ్స్, మంచు కొండల్లో ఫైట్ సీన్స్ విపరీతంగా ఆకట్టుంటున్నాయి. కష్టమొస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి.. కష్టమొచ్చనా దేవుడు రాడు అని నమ్మించాలి అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే సనాతన ధర్మం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
కాగా.. ఇటీవలే ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వర్షన్‌లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.


