ఈ రోజు (నవంబరు 21) థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో కాస్త ఎడ్జ్ తీసుకున్న సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. హీరోహీరోయిన్లు, దర్శకుడు అందరూ కొత్తవాళ్లే. అయినా సరే ఓ షాకింగ్ ప్రేమకథని ప్రెజెంట్ చేశారు. అందుకు తగ్గట్లే మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సరే ఈ సంగతి కాసేపు పక్కనబెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కాస్త ఆవేశానికి లోనైన డైరెక్టర్.. పెద్ద ఛాలెంజ్ చేశాడు. దానిపై ట్రోలింగ్ జరిగేసరికి ఇప్పుడు సారీ చెప్పేశాడు.
(ఇదీ చదవండి: ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ)
సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్న 'రాజు వెడ్స్ రాంబాయి' దర్శకుడు సాయిలు కాంపాటి, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్‌లో చొక్కా తీసి తిరుగుతా అని అన్నాడు. కానీ ఈ వ్యాఖ్యలపై ట్రోలింగ్ కాస్త గట్టిగానే వచ్చింది. సినిమా బాగుంటే సరే గానీ ఇంత పెద్ద స్టేట్‌మెంట్స్ అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి. దీంతో ఇప్పుడు రియలైజ్ అయ్యాడు.
ఈ రోజు మధ్యాహ్నం సక్సెస్ మీట్ జరగ్గా ఇందులో మాట్లాడిన డైరెక్టర్ సాయిలు.. 'కొత్త డైరెక్టర్లకు మాట్లాడటం రాదు. దయచేసి క్షమించండి అన్న. అమీర్‌పేట్‌లో సాయంత్రం వచ్చి బ్యాండ్ కొడతా అన్నా' అని తన వ్యాఖ్యలని సవరించుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. అఖిల్ రాజ్, తేజస్వి రావు ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఖమ్మంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.
(ఇదీ చదవండి: మనసు దోచేస్తున్న 'రాంబాయి'.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)
"Konni Years Nunchi Padina Kashtaniki Ee Phalitham Chushaka Maatalu Raatledu"
Watch Director #SaailuKampati speech @ #RajuWedsRambai Gratitude Meet💥
▶️ https://t.co/e7rE9F4qCp
Event By @shreyasgroup ✌️#RajuWedsRambai #RajuWedsRambaiGratitudeMeet@etvwin @venuudugulafilm… pic.twitter.com/xtHCdo2KWG— Shreyas Media (@shreyasgroup) November 21, 2025


