ఈ వారం డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాగా.. వాటిలో మూడు సినిమాలు మాత్రమే కొద్దోగొప్పో బజ్‌తో ఉన్నట్లు కనిపించాయి. ఇప్పుడు వాటిలో 'రాజు వెడ్స్ రాంబాయి'కి కాస్త ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. సినిమా క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో హీరోయిన్ కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈమె ఎవరా? బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని ఆరా తీస్తున్నారు.
(ఇదీ చదవండి: ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ)
'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలో హీరోయిన్ అసలు పేరు తేజస్వి రావు. గతేడాది రిలీజైన 'కమిటీ కుర్రోళ్లు' సినిమాలో జ్యోతి పాత్ర చేసింది ఈమెనే. ముద్దు పెట్టుకుంటే కడుపు వచ్చేస్తాది అని ఏడిచే అమ్మాయిగా చేసింది ఈమెనే. అందులో అందులో కట్టుబొట్టు ఒకలా ఉండటంతో పాటు ఎక్కువమంది నటీనటుల ఉండటంతో ఈమెకు ఓ మాదిరి గుర్తింపు మాత్రమే వచ్చింది. ఇప్పుడీ మూవీలో హీరోయిన్‌గా ఆకట్టుకోవడంతో వైరల్ అయిపోయింది.
ఈమె పుట్టింది గోదావరి జిల్లాలో అయినప్పటికీ.. రాంబాయిగా తెలంగాణ పిల్లగా మంచి యాక్టింగ్ చేసింది. సినిమాలో ఈమె ఇచ్చిన చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌కి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అయితే కమిటీ కుర్రోళ్లు, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు చేయడానికి ముందు దాదాపు ఐదేళ్లుగా షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసింది. వీటిలో సయోని, బావమరదలు 1-2, పెళ్లి కూతురు విత్ మెనీ డౌట్స్, మినిట్స్, నిశ్చితార్థం, పెళ్లి కూతురు, కేరళ కుట్టి, లవ్ స్టోరీ ఇన్ రాజమండ్రి, మాస్ గాడి క్లాస్ పిల్ల.. ఇలా చాలా లఘు చిత్రాలు చేసింది. ఇన్నాళ్లకు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. రాబోయే రోజుల్లో ఈమె దశ తిరిగేలా కనిపిస్తుంది.
(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)


