ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. విమల్ థియేటర్‌లోకి ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ దూసుకొచ్చారు.
తెలంగాణలో ప్రీమియర్ షోస్‌కు అనుమతులు లేకపోవడంతో రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మీడియా కోసం విమల్ థియేటర్‌లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారన్న సమాచారంతో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ విమల్ థియేటర్‌లోకి ఒక్కసారిగా దూసుకు రావడంతో ప్రెస్ షోను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ ఘటనతో విమల్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


