హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. టబు, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, వామికా గబ్బి, జిస్సు సేన్ గుత్తా ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. శోభా కపూర్, ఏక్తా కపూర్, అక్షయ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే మే 15న రిలీజ్ చేయనున్నట్లుగా గురువారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ‘బంగ్లా నుంచి కొత్త కబురు వచ్చింది. మే 15న బంగ్లా డోర్స్ తెరుచుకుంటాయి (న్యూ రిలీజ్ డేట్‌ని ఉద్దేశించి)’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు.


