రాజాసాబ్‌ రిలీజ్‌.. థియేటర్లలో మొసళ్లు! | Fans with Crocodiles at Prabhas The Raja Saab Movie Theater | Sakshi
Sakshi News home page

థియేటర్‌లోకి మొసళ్లు పట్టుకెళ్లిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌!

Jan 9 2026 7:43 AM | Updated on Jan 9 2026 9:44 AM

Fans with Crocodiles at Prabhas The Raja Saab Movie Theater

డార్లింగ్‌ ప్రభాస్‌ హారర్‌ జానర్‌లో తొలిసారి నటించిన చిత్రం ది రాజాసాబ్‌. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. గురువారం (జనవరి 8) నుంచే ప్రీమియర్‌ షోస్‌ ప్రారంభమయ్యాయి. దీంతో అభిమానులు థియేటర్‌ లోపల, బయట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మొసళ్లు పట్టుకుని థియేటర్‌లో హంగామా చేసినట్లు వీడియోలు వైరలవుతున్నాయి.

థియేటర్‌లో మొసళ్లు?
అయితే అవి నిజం మొసళ్లు కాదు, డమ్మీవి.. ఆ మాటకొస్తే కొన్ని వీడియోలు కూడా నిజమైనవి కావని తెలుస్తోంది. ఓ వీడియోలో సీట్లన్నీ ఒకవైపు ఉంటే.. స్క్రీన్‌ మాత్రం సీట్లకు ఎదురుగా కాకుండా కుడివైపు ఉంది. దీన్ని బట్టి అది ఫేక్‌ వీడియో అని ఇట్టే అర్థమవుతోంది. మరో వీడియోలో అయితే అందరూ మొసళ్లు పట్టుకుని రాజాసాబ్‌ అని నినాదాలు చేస్తున్నారు. 

అదీ సంగతి!
ఇక ఇంకో వీడియోలో ఓ బొమ్మ మొసలిని పట్టుకుని ఆడించారు. ఇదైతే నిజమే అని తెలుస్తోంది. ది రాజాసాబ్‌ మూవీలో ప్రభాస్‌ మొసలితో పోరాడే సన్నివేశం ఉంటుంది. ట్రైలర్‌లోనూ ఆ క్లిప్‌ చూపించారు. దీంతో అభిమానులకు థియేటర్‌లో మొసళ్లు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. కొందరు డమ్మీ బొమ్మలతో ఆడుతుంటే మరికొందరు ఏకంగా ఏఐ వీడియోలు సృష్టిస్తున్నారు. 

సినిమా
రాజాసాబ్‌ సినిమా విషయానికి వస్తే.. ఇందులో నిధి అగర్వాల్‌, మాళవికా మోహనన్‌, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్‌ నటులు సంజయ్‌దత్‌, బొమన్‌ ఇరానీ, జరీనా వాహబ్‌ కీలక పాత్రలు పోషించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్‌గా విడుదలైంది.

 

 

చదవండి: ది రాజాసాబ్‌ మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement