మలయాళ నటి హనీరోజ్(Honey Rose) నటిస్తున్న కొత్త సినిమా ‘రాహేలు’.. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా రోమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు ఆనందిని బాలా రివేంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ ప్రముఖ నటులు రోషన్ బషీర్, రాధికా రాధాకృష్ణన్ కీలక పాత్రలో నటించారు. ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బాగా పాపులర్ అయిన హనీరోజ్ .. చాలారోజుల తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించగా తాజాగా విడుదలైన సాంగ్ హనీ గ్లామర్‌తో హీట్ పెంచేసింది.


