ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ముద్దుల కూతురి అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అర్హ పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే టూ మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు కూడా అర్హకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప -2 లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోందని తెలిసింది. కాగా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని.. భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందని, ఈ కారణాల వల్ల ఈ సినిమా విడుదల 2027లో ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను అట్లీ పక్కాగా ప్లాన్ చేయడమే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027లో కాకుండా ఒక ఏడాది ముందే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Happy birthday to my little princess #AlluArha 💖 pic.twitter.com/pRnMDIOlTe
— Allu Arjun (@alluarjun) November 21, 2025
Wishing our sweetest and adorable little princess #AlluArha a very Happy Birthday! 🤩
May this year bring you endless happiness and beautiful memories. ❤️#HBDAlluArha #HappyBirthdayAlluArha pic.twitter.com/ZSWgFi8Tl7— Geetha Arts (@GeethaArts) November 21, 2025


