టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది. తనకు నచ్చిన విషయాలనే ఓపెన్‌గా మాట్లాడడం.. పాలిటిక్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీ విషయాలపై కూడా స్పందించడం పూనమ్‌కు అలవాటు. ఆమె చేసే పోస్టులు కొన్ని కాంట్రవర్సీగా, చర్చనీయాంశంగానూ మారాయి.
పలుమార్లు ఆమెపై ట్రోలింగ్ కూడా నడిచింది. అయినా కూడా పూనమ్ తన వైఖరిని మార్చుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ హీరోయిన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను చిత్ర హింసలకు గురి చేశాడంటూ పూనమ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
(చదవండి: ఎన్నో దారుణాలు చూశా.. నాకు విలువ లేదు.. అందుకే విడాకులు!)
తాజాగా పూనమ్(Poonam Kaur ) ఓ యూట్యూబ్ చానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేదు అనుభవాల గురించి వివరిస్తూ..సోషల్ మీడియాలో చేసే పోస్టులపై గురించి కూడా మాట్లాడింది. 'మన ఇల్లు బాగుండాలని పక్కింటిని కూల్చేయడం సరికాదు. అది కూడా చదువుకున్న వ్యక్తి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అంటూ గతంలో పూనమ్ చేసిన ట్వీట్ గురించి యాంకర్ ప్రశ్నించగా..దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటో ఆమె వివరించింది.
‘నేను ఊరికే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టను. నా హార్ట్‌కు టచ్ అయిన విషయాల గురించే మాట్లాడుతుంటాను. మీకు తెలుసా... ఓ డైరెక్టర్, ఓ హీరోయిన్ కోసం తన భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అతడు కొట్టడంతో ఆమె ఐదారు రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే జరిగింది. అన్యాయం జరిగినా ఆ మహిళ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాదు ఇదంతా జరిగిన తర్వాత కూడా సినిమా ఈవెంట్లకు భర్తతో కలిసి హాజరైంది. ఆ దర్శకుడి సినీ జీవితం గురించి ఆమె ఆలోచించి.. హీరోయిన్‌తో పెట్టుకున్న సంబంధం గురించి బయటకు చెప్పలేదు. ఈ విషయం తెలుసుకుని నేను చాలా షాకయ్యాను. మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నాను’ అని పూనమ్ చెప్పుకొచ్చింది. అయితే ఆ దర్శకుడు, హీరోయిన్ ఎవరనేది మాత్రం ఆమె బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం పూనమ్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అతను ఎవరా? అనే చర్చ కొనసాగుతోంది.


