హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్‌ని 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపుగా యాక్టింగ్‌కి దూరమైపోయింది. అయితే పెళ్లికి ముందు ఒప్పుకొన్న చిత్రాలు కొన్ని ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చాయి. అలాంటి వాటిలో తమిళ థ్రిల్లర్ 'తనెల్'. తెలుగులో దీన్ని 'టన్నెల్' పేరుతో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఓ ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు మరో దానిలోనూ అందుబాటులోకి వచ్చేసింది.
యంగ్ హీరో అధర్వ లేటెస్ట్ మూవీ 'టన్నెల్'. తమిళంలో సెప్టెంబరు 12న థియేటర్లలో రిలీజ్ కాగా వారం ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలోకి వచ్చింది. డబ్బింగ్ మూవీ కావడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ గత నెలలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్ వచ్చాయి. ఇప్పుడు నెల గ్యాప్ తర్వాత లయన్స్ గేట్ ప్లే అనే మరో దానిలోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.
(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)
'టన్నెల్' విషయానికొస్తే.. కొందరు పోలీసులని విలన్ గ్యాంగ్ చంపేస్తుంది. మరోవైపు అను (లావణ్య త్రిపాఠి)ని అఖిల్ (అధర్వ) ప్రేమిస్తుంటాడు. ఉద్యోగం లేకుండా ఉన్న నీకు ఎలా కూతుర్ని ఇవ్వాలని అను తండ్రి అడుగుతాడు. దీంతో స్నేహితులతో కలిసి అఖిల్ కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చుకుంటాడు. అందరికీ ఒక్కచోటే పోస్టింగ్ వస్తుంది. కానీ జాయినింగ్ రోజే పెద్ద షాక్.
కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన హీరో, అతడి ఫ్రెండ్స్ ఓ రాత్రి.. విలన్ గ్యాంగ్ ట్రాప్‌లో చిక్కుకుంటారు. అది ఓ స్లమ్ ఏరియా. మరి విలన్ నుంచి కొత్త కానిస్టేబుల్స్ తప్పించుకున్నారా? రాత్రి ఏం జరిగింది? టన్నెల్‌లో ఏముంది? ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: రాజాసాబ్: విజిల్స్ వేయించే సాంగ్ వస్తోంది!)


