యదార్థ సంఘటనలతో తెరకెక్కిన సినిమా అంగమ్మాల్. దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కోడలైన గీత కైలాసం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించాడు. రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన కొడు తుని అనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్‌లో జనవరి 9 నుంచి ప్రసారం కానుంది. అయితే కేవలం తమిళ భాషలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
అంగమ్మాల్ కథ విషయానికి వస్తే..
జీవితాంతం రవిక అంటే ఏంటో తెలీక బండచాకిరీ చేస్తూ కొడుకుల్ని పోషించింది తల్లి. భర్త పోయాక ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాకింది. చిన్న కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకుని సంబంధం మాట్లాడేందుకు అతడి ఊరొస్తామంటారు.
పట్నంలో పెరిగిన హైక్లాస్ మనుషులు అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? రవిక లేకుండా చూస్తే నోరెళ్లబెట్టరా? అని ఆలోచించిన చిన్నకొడుకు తల్లిని జాకెట్ వేసుకోవాల్సిందేనని పట్టుబడతాడు. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ!
Her name says it all. Angammal.
Angammal From Jan 9th#SunNXT #AngammalOnSunNXT #Angammal@kaarthekeyens @ksubbaraj @njoy_films @stonebenchers
Writer: @perumalmurugan_offl@kailasam.geetha @_saranofficial @actor_bharani @thendral_raghunathan @mullaiyarasii @vinodanandr… pic.twitter.com/B3YeHx5zuk— SUN NXT (@sunnxt) January 6, 2026


