బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు 38 ఏళ్లు. ఇప్పటికీ తన ఫోకస్ అంతా సినిమాలపైనే తప్ప పెళ్లిగురించి ఆలోచించడమే లేదు. అయితే కొంతకాలంగా రచయిత రాహుల్ మోదీతో ప్రేమాయణం నడుపుతోంది. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది.
పెళ్లి చేసుకుంటా
సోషల్ మీడియాలో జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది శ్రద్ధా కపూర్. ఈ మేరకు ఓ యాడ్ వీడియో పోస్ట్ చేసింది. అందులో లవ్- బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. దానికి హీరోయిన్ స్పందిస్తూ... నేను కూడా పెళ్లి చేసుకుంటా అని రిప్లై ఇచ్చింది. అది చూసి ఆశ్యర్యపోయిన అభిమానులు.. పెళ్లెప్పుడు? అని ఆరా తీస్తున్నారు.
సినిమా
శ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా.. తుంబాడ్ సినిమా ప్రీక్వెల్ పహడ్‌పాంగిర మూవలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్త్రీ 3, భేడియా 2 మూవీస్‌లోనూ యాక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఈతా సినిమాలో యాక్ట్ చేస్తోంది.
చదవండి: దర్శకురాలిగా హనుమాన్ నటి ఎంట్రీ


