సమంత మాస్‌ లుక్‌.. సంక్రాంతికి సర్‌ప్రైజ్‌ | Samantha Shares Crazy Update Of Maa Inti Bangaaram Movie | Sakshi
Sakshi News home page

సమంత మాస్‌ లుక్‌.. సంక్రాంతికి సర్‌ప్రైజ్‌

Jan 7 2026 11:02 AM | Updated on Jan 7 2026 11:11 AM

Samantha Shares Crazy Update Of Maa Inti Bangaaram Movie

స్టార్‌ హీరోయిన్‌ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.  ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ అనే బ్యానర్‌ని స్థాపించి.. తొలి ప్రయత్నంగా 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్‌ అందుకుంది. అదే బ్యానర్‌పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఇందులో ఆమే హీరోయిన్‌. ‘ఓ బేబీ’ తర్వాత సామ్‌తో కలిసి నందిని రెడ్డి చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే దర్శకురాలు పేరు తప్ప.. ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ని పంచుకుంది సమంత. 

(చదవండి: ఓటీటీలో తమిళ ఫీల్‌గుడ్‌ మూవీ.. ఎక్కడంటే?)

సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’ అంటూ ఆ పోస్టర్‌కి క్యాప్షన్‌ రాసుకొచ్చారు. జనవరి 9న ఈ సినిమా టీజర్‌ విడుదల చేయనున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.  

(చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్తోన్న బ్యూటీ.. ఎప్పుడో మరి!)

ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా..సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు గుల్షన్‌ దేవయ్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుఉతున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement