టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా మాజీ భార్య, డ్యాన్సర్ నటాషా స్టాంకోవిచ్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను సొంతం చేసుకుంది. ఈ కారు విలువు దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. నటాషా స్టాంకోవిచ్ గతంలో క్రికెటర్ హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకుంది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత జూలై 2024లో అతనితో విడిపోయింది. ఈ మాజీ జంటకు అగస్త్య అనే కుమారుడు ఉన్నారు. విడిపోయినప్పటికీ బాబుకు తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ ప్రస్తుతం మోడల్ మహీకా శర్మతో డేటింగ్‌లో ఉన్నారు.
అయితే విడాకుల తర్వాత నటాసా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతోంది. తాను మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవలే ప్రకటించింది. భవిష్యత్తులో తనకు నచ్చినవాడు దొరికితే రెండో పెళ్లికి సిద్ధమేనని పరోక్షంగా హింట్ ఇచ్చింది ముద్దుగుమ్మ.


