పండగ సీజన్‌కి టాలీవుడ్‌లో సినిమాల వరద కురుస్తోంది. ఒకేసారి అయిదు సినిమాలు రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, వాటి ప్రమోషన్లలోనూ పోటీ వాతావరణం నెలకొంది. జనవరి 7న ప్రత్యేక హంగామా జరగనుంది. అదే రోజు రెండు ట్రయిలర్లు, రెండు ప్రీరిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఇప్పటికే రాజాసాబ్, శంకర ప్రసాద్ ట్రయిలర్లు విడుదలయ్యాయి. ఇక నవీన్ పోలిశెట్టి రాజుగారు, రవితేజ భక్త మహాశయులు ట్రయిలర్లు జనవరి 7న విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఒక ట్రయిలర్, సాయంత్రం 6 గంటలకు మరో చిత్రం ట్రయిలర్ రానున్నాయి. అదే రోజు మెగాస్టార్ శంకర ప్రసాద్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘రాజాసాబ్’ కోసం ప్రత్యేక ఈవెంట్ సెట్‌లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ ట్రయిలర్ మాత్రం 7న వస్తుందా లేక 8న వస్తుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇక జనవరి 9 నుంచి సినిమాల హడావుడి మొదలవుతుంది. అందుకే మొత్తం కంటెంట్‌ను ఆ లోపే విడుదల చేయాలని మూవీ టీమ్‌లు ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి ఒకేరోజు టాలీవుడ్‌లో ఒకవైపు ట్రయిలర్లు, మరోవైపు ఈవెంట్లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్‌మెంట్ ఫుల్ డోస్ అందనుంది.


