సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో డర్బన్ సూపర్ జెయింట్స్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. భారత పర్యటన కారణంగా సీజన్ మధ్యలోనే వైదొలిగిన కివీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే స్ధానాన్ని ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌తో డర్బన్ భర్తీ చేసింది.
ఈ విషయాన్ని సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోమవారం అధికారికంగా ధ్రువీకరించింది. కాన్వే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి జాతీయ విధుల కారణంగా లీగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది సీజన్‌లో కేవలం 4 మ్యాచ్‌లు ఆడిన కాన్వే.. 173.44 స్ట్రైక్ రేట్‌తో 111 పరుగులు చేశాడు. ఇక లివింగ్‌స్టోన్ విషయానికి వస్తే.. అతడికి ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడిన అనుభవం ఉంది.
అతడు గతంలో ఎంఐ కేప్ టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన లివింగ్‌స్టోన్ 158 పరుగులు చేసి, 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇంగ్లండ్ డేంజరస్ ఆల్‌రౌండర్ రాకతో సూపర్ జెయింట్స్‌కు మరింత బలం చేకూరనుంది.
డర్బన్ సూపర్ జెయింట్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన సూపర్ జెయింట్స్.. ఒక్క మ్యాచ్‌లో గెలుపొందగా, మరో రెండింట ఓటమి చవిచూసింది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి.
పాయింట్ల పట్టికలో జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్ , సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో డర్బన్ నిలవాలంటే రాబోయే మ్యాచ్‌లు చాలా కీలకం కానున్నాయి. డర్బన్ సూపర్ జెయింట్స్ తన తదుపరి మ్యాచ్‌లో జనవరి 7న ప్రిటోరియా క్యాపిటల్స్‌తో తలపడనుంది.
చదవండి: IND vs SA: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే


